*”ఆటకధర శివ” సినిమా రివ్యూ*

by Sunil Reddy · November 15, 2025

తోట కనకయ్య రచన దర్శకత్వంలో ‘ఆటకధర శివ’ నాగు మంత్రి వెంకట శివ నిర్మాణంలో వచ్చిన ఒక రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో లోడగల రాము హీరోగా నటించగా నాగుమంత్రి కమలహాసన్ కి హీరోయిన్ గా శశాంక్ శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. దాము ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయగా హరి తాడికొండ, రామ్ నువ్వుల ఈ సినిమాకు ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం ఈరోజు, నవంబర్ 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది.

 

కథ :

 

తోట కనకయ్య అనే మధ్యతరగతి వ్యక్తి తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు మరియు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నందుకు చింతిస్తున్నాడు. తన పిల్లలు మంచి విద్య మరియు జీవితాన్ని గడపాలని అతను కోరుకుంటాడు, కానీ వారికి చదువుపై ఆసక్తి లేదు.

 

కథనం :

కనకయ్య అకాల మరణం తర్వాత కథ నాటకీయ మలుపు తిరుగుతుంది, అతని కుటుంబం అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. వారు కష్టపడుతుండగా, అతను తమ కోసం చేసిన త్యాగాలను వారు గ్రహించడం ప్రారంభిస్తారు మరియు అతని మరణం చుట్టూ ఉన్న రహస్యం బయటపడుతుంది, ఇది ఊహించని మలుపులకు దారితీస్తుంది.

 

నటీనటుల నటన :

హీరోగా లొడగల రాము సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా నాగుమంత్రి కమల షణ్ముఖి నటిస్తూ తనదైన శైలిలో తలపై కనిపించారు. నటుడిగా నాగుమంత్రి వెంకట శివ తన పాత్ర పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

 

సాంకేతిక విశ్లేషణ :

ఒక మధ్య తరగతి కుటుంబ కథను తాను అనుకున్నట్లు ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా రాయడంలో అలాగే వెండితెరపై ఒక చిత్త రూపంలో ప్రేక్షకులకు అందజేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాలోని లొకేషన్స్ చాలా నాచురల్ గా సీన్లకు తగ్గట్లు లైటింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఏ లోపం లేకుండా జాగ్రత్త పడ్డారు. పాటలు చిత్రానికి బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

సారాంశం :

భావోద్వేగాలు, హాస్యం, ఊహించని మలుపుల కలయికతో ఎంతో ఆకర్షణీయంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుటుంబ చిత్రం ఆటకధర శివ.

 

రేటింగ్ : 3.5/5

You may also like